Chandrababuకు RGV బర్త్ డే గిఫ్ట్.. చంద్రబాబు 'సిక్కోసైకో' అంటూ వ్యంగంగా వీడియో

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఆయన ఎక్కువగా మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై పలు కామెంట్స్, విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తాజాగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆర్జీవీ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Chandrababu Naidu SickoPsyco Song Released By Ram Gopal Varma On Birthday

వివిధ జోనర్లలో..: తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి అతి తక్కువ కాలంలో దేశంలోనే క్రేజీ అండ్ డిఫరెంట్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకు సుమారు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని విధంగా పాపులారిటీ సాధించికున్నారు. అయితే ఈ ఫేమ్ తర్వాత ప్రేక్షకులు మెచ్చని విధంగా సినిమాలు తీస్తూ విమర్శల పాలయ్యారు.

అదిరిపోయే ఫాలోయింగ్: రంగీల, సర్కార్, ఆగ్, శివ, క్షణ క్షణ వంటి సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిలతో రచ్చ చేసే విధానంతో పాటు ట్వీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుంది. ఇటీవల అయితే ఆయన ఎక్కువగా కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు.

ఆర్జీవీ ట్వీట్ల రచ్చ: ఒకప్పుడు డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా అడల్ట్ తరహా కంటెంట్ సినిమాలు తీస్తున్నారు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ సినిమాలను తెరకెక్కించారు. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేయగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చారు. ఇక ట్విటర్ వేదికగా ఆర్జీవీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

బర్త్ డే కానుక అంటూ: ఏప్రిల్ 20 గురువారం రోజున తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు, సెబ్రిటీలు రాజకీయ నాయకులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను టార్గెట్ చేస్తూ బర్త్ డే కానుక అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండటం నుంచి నేటి పరిస్థితి వరకు వ్యంగంగా పాట రూపంలో తెలిపారు.

సైకో సిక్ అని వర్ణన: సీనియర్ ఎన్టీఆర్ తో కాంగ్రెస్ లో గెలిచి చూపిస్తానని చంద్రబాబు నాయిడు ఛాలెంజ్ చేసి ఘోరంగా ఓడిపోయారని వీడియోలో తెలిపారు. తర్వాత తెలుగు దేసంలోకి చేరిన సీబీఎన్ మామకు వెన్నుపోటు పొడిచారని, ఆ కర్మ కాలి ఇప్పుడు బాధపడుతున్నాడంటూ, ఏడుస్తున్నాడంటూ లిరిక్స్ రూపంలో ఉన్నాయి. జగన్ ను సైకో అని సీబీఎన్ పెద్ద సిక్కోసైకో అని అభివర్ణించారు దర్శకుడు ఆర్జీవీ.

దారుణంగా ట్రోలింగ్: ఈ వీడియోలో సిక్కోసైకో అనే పదానికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉన్న అర్థాన్ని చెప్పారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అంతేకాకుండా ఈ పాటకు మ్యూజిక్, సింగింగ్, లిరిక్స్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ క్రియేటే చేసిందని చెప్పడం మరింత వ్యంగంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు బాగుందని అంటే.. మరికొందరు ఆర్జీవీని తిడుతున్నారు. మొత్తానికి బర్త్ డే గిఫ్ట్ అని చెప్పి చంద్రబాబును ఆర్జీవీ దారుణంగా ట్రోల్ చేశాడని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X