స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవికి శుభాకాంక్షలు: చంద్రబాబు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)

ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చిరుకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

Chandrababu Naidu Special Wishes To Chiranjeevi

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టుపై అటు మెగా అభిమానులు.. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఆయన పేరుతో రూపొందించిన #HBDEvergreenMegaStar ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత #HBDMegaStarChiranjeevi రెండో స్థానంలో, #SyeRaaNarasimhaReddy మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. అలాగే, #MegaStarBirthday ఐదో స్థానంలో ఉంది. అంటే టాప్ 10లో చిరంజీవి ట్యాగ్స్ నాలుగు ఉండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X