‘రౌడీ ఫెలో’కు సీఎం చంద్రబాబు మద్దతు!
హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా ‘రౌడీ ఫెలో' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో ఈ నెల 13న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రి అయిన తర్వాత పాల్గొంటున్న తొలి ఆడియో వేడుక ఇదే కావడం విశేషం. చంద్రబాబు నాయుడు హాజరవుతుండటంతో ఆడియో వేడుకలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబాల అభిమానులు భారీగా తరలి వస్తారని అంచనా.
ఈ చిత్రం ద్వారా సినీగేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నారా రోహిత్ సరసన విశాఖ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నందినీ రాయ్ సెకండ్ హీరోయిన్. ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం.

గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రకాష్ రెడ్డి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ... 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











