twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అత్తగారు జీవించి ఉండగా చెప్పిన కథ, రానా గురించి మీరే చెప్పాలి.. 'ఎన్టీఆర్' చూశాక చంద్రబాబు!

    |

    Recommended Video

    Chandrababu Naidu Review On NTR Kathanayakudu Movie | Filmibeat Telugu

    అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథాయనకుడు జనవరి 9న విడుదలైంది. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో రూపొందించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటన, క్రిష్ దర్శత్వం, ఇతర పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో, బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో కలసి ఎన్టీఆర్ కథాయనకుడు చిత్రాన్ని వీక్షించారు.

    ఇది ఒక చరిత్ర

    ఇది ఒక చరిత్ర

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూశాక చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితం అనేది ఒక చరిత్ర. దానిని బాలకృష్ణ ఈ చిత్రం ద్వారా మళ్ళీ తిరగరాశారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి మొత్తం ఈ చిత్రాన్ని చూడాలి అని అన్నారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేసే సాధారణ వ్యక్తి అక్కడి అవినీతిని భరించలేక, భవిష్యత్తుని కూడా లెక్కచేయకుండా ఉద్యోగాన్ని వదిలేశారు. నటుడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు అని చంద్రబాబు తెలిపారు.

    ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

     పాతరోజులన్నీ గుర్తుకు వస్తున్నాయి

    పాతరోజులన్నీ గుర్తుకు వస్తున్నాయి

    ఎన్టీఆర్ జీవితంలో అధైర్యం అనే మాటే లేదు. అన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. చిన్ననాటి నుంచి ఆత్మగౌరవంతో పెరిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు తెలిపారు. ఈ చిత్రాన్ని చూశాక నాకు పాతరోజులన్నీ గుర్తుకు వచ్చాయి. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో పాటు ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు అభినందించారు.

     అది మీరే చెప్పాలి

    అది మీరే చెప్పాలి

    ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో రానా యంగ్ చంద్రబాబుగా కనిపిస్తాడు. రానా పాత్ర గురించి మీడియా బాబుని ప్రశ్నించింది. రానాని చూశాక ఎలా అనిపించింది.. మిమ్మలి మీరే చూసుకునట్లు అనిపించిందా.. అతడు మీ పాత్రలో బాగా నటించాడా అంటూ విలేకరులు అడిగారు. రానా పాత్ర గురించి నాకన్నా మీరే బాగా జడ్జ్ చేయగలరు. ఆ విషయం మీరే చెప్పాలి అని చంద్రబాబు చమత్కరించారు.

    రానా పాత్ర మాత్రమే కాదు

    రానా పాత్ర మాత్రమే కాదు

    ఈ చిత్రంలో కేవలం రానా పాత్ర మాత్రమే కాదు.. ఇతర పాత్రలుచేసిన నటీనటులు కూడా జీవించారు అని చంద్రబాబు కితాబిచ్చారు. ప్రతి ఒక్క పాత్రని ఆయా వ్యక్తులకు దగ్గర పోలికలు ఉండేలా రూపొందించడంలో దర్శకుడు క్రిష్ విజయవంతం అయ్యారని తెలిపారు. ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంది. డైలాగులు, నటీనటుల బాడీ లాంగ్వేజ్ అంతా బావుంది అని చంద్రబాబు అన్నారు.

    మా అత్తగారు జీవించి ఉండగా

    మా అత్తగారు జీవించి ఉండగా

    చంద్రబాబు బసవతారకం ప్రస్తావన కూడా చేశారు. మా అత్తగారు జీవించి ఉండగా చెప్పిన కథతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని రూపొందించారని చంద్రబాబు అన్నారు. ఇక రెండవ భాగం మహానాయకుడు గురించి మాట్లాడుతూ.. అందులో కూడా ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందే అంశాలే ఉంటాయని తాను భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

    English summary
    Chandrababu watches NTR Kathanayakudu movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X