కోరుకొండ సైనిక స్కూల్ దగ్గర వెంకటేష్
వెంకటేష్ హీరోగా కన్నడంలో సూపర్ హిట్టయిన ఆప్త రక్షక చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ విజయనగరంలోని కోరుకొండ సైనిక స్కూల్ దగ్గరలోని ఓ కోటలో ప్రారంభమైంది. వెంకటేష్...ఈ షూటింగ్ లో నేటి నుంచి(మే 13) పాల్గొంటున్నారు. హీరోయిన్స్ రిచా గంగోపాద్యాయ, కమిలినీ ముఖర్జీ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనూష్క మెయిన్ రోల్ లో చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షకలో విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఇక పి.వాసు కన్నడ చిత్రాన్ని కూడా డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా చంద్రముఖి 2 అని వుంచి తర్వాత మార్చే యోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











