సినీ విలేజ్ లో శరవేగంగా చంద్రముఖి సీక్వెల్ షూటింగ్..!
కన్నడ సినిమా 'ఆప్తరక్షక' ఆధారంగా తమిళ సినిమా చంద్రముఖి కి కొనసాగింపుగా సెన్సేషనల్ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాణ సారధ్యంలో వెంకటేష్ హీరోగా 'చంద్రముఖి-2' నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న'చంద్రముఖి సీక్వెల్" (నాగవల్లి) చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ సిటిలో రామానాయుడు సినీ విలేజ్ లో మొన్న (జూన్ 15) మొదలైన రెండవ షెడ్యూల్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క, నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రియమణి, ఫ్యామిలీ టైప్ హీరోయిన్‌గా స్టాంప్ వేయించుకున్న స్నేహ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, పెద్ద సినిమా కాబట్టి శ్రద్దా దాస్, కమలిని మఖర్జి, రిచా గంగోపాద్యాయ కూడా ఇందులో ఒక చిన్న పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న వెంకటేష్ ని ఈ చిత్రంలో సరికొత్తగా చూడొచ్చు అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











