చంద్రముఖి సీక్వెల్ షురూ!
చంద్రముఖి అద్బుత విజయం సాదించిన తర్వాత చంద్రముఖి సీక్వెల్ వస్తుంది..అని గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం అయితే చంద్రముఖి సీక్వెల్ లో హీరోగా ఇప్పటికి మూడు పేర్లు వినిపించాయి. మొదటిది రజనీకాంత్ అయితే రెండవది చిరంజీవి..వీరిద్దరూ కాదని ముచ్చటగా మూడో హీరో విక్టరీ వెంకీ అందుకు సెలక్ట్ అయ్యారు.
వెంకటేష్ హీరోగా 'చంద్రముఖి" సీక్వెల్ ప్రారంభమైంది. పి వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తెరకెక్కిస్తోన్న ఈ సినపిమాలో వెంకీ సరసన, అనుష్క, కమలినీ, స్నేహా, రిచాగంగోపాద్యాయ, శ్రద్దాదాస్, హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
చంద్రముఖి తరహాలోనే 'చంద్రముఖి సీక్వెల్ విజయవంతం కావాలని, డైరెక్ట్ తెలుగులో తెరకెక్కుతోన్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాయాలని వక్తలు ప్రారంభోత్సవంలో అభిప్రాయపడ్డారు. వెరైటీ సినిమాల్ని కోరుకునే తనకు, ఈ చిత్రం చాలా వెరైటీగా అన్సించడంతో వెంటనే ఒప్పుకున్నానన్న వెంకీ, ఈ సినిమా కోసం వెరైటీ గెటప్ కూడా వేస్తున్నానని చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











