చంద్రశేఖర్ యేలేటి అశోశియేట్ దర్శకత్వంలో....
ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు వంటి చిత్రాలు రూపొందించిన యేలేటి చంద్రశేఖర్ వద్ద అశోసియేట్ గా పనిచేసిన రవి దర్శకుడుగా మారుతున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నవదీప్ ఈ చిత్రంలో మరో కీలకపాత్రను చేస్తున్నాడు. మొదట సందీప్ కృష్ణను ఈ చిత్రంలో అనుకున్నారు కానీ అతను ఎక్కవ రెమ్యునేషన్ అడగటంతో నవదీప్ ఆ ప్లేస్ లోకి వచ్చినట్లు సమాచారం. జూలై నుంచి షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం కోసం హీరోయిన్ హంట్ మొదలైంది. ఇక రాజీవ్ ఇంతకుముందు నోట్ బుక్ చిత్రంలోనూ, మరో చిత్రంలోనూ చేసారు. ఇక యేలేటి చంద్రశేఖర్..ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
నవదీప్ కళ్యాణ్ రామ్ చంద్రశేఖర్ యేలేటి అనుకోకుండా ఒక రోజు ఒక్కడున్నాడు రాజీవ్ navdeep kalyan ram chandrasekhar yeleti ravi okkadunnadu rajeev


Click it and Unblock the Notifications