గోపీచంద్‌ చిత్రం షూటింగ్ పూర్తి

By Srikanya

హైదరాబాద్: గోపీచంద్‌, తాప్సీ జంటగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొత్తానికి పూర్తైంది. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేసారు. దాంతో టాకీ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు చెప్తున్నారు. త్వరలో కడప జమ్మల మడుగులో ఈచిత్రానికి సంభందించి ప్యాచ్ వర్క్ చేస్తారు.ఈ చిత్రానికి 'జాక్‌పాట్‌' అనే పేరు పరిశీలిస్తున్నారు.

నిధుల అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్‌ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ ఎటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం. మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.

చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓ దేశం నుండి ఓ సామాన్యుడు సాహసోపేతంగా నిధిని ఎలా సాధించాడన్నదే ఈ చిత్రం కధాంశమని, అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని జోర్డాన్, రాజస్థాన్, లడఖ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని, ఈ కాలానికి తగ్గట్టుగా 'ట్రెజర్ హంట్' కథను సరికొత్తగా చిత్రంలో చూపిస్తామని, తాను ఇదివరకుచేసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X