twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేష్ చిత్రం కన్ఫర్మ్

    By Srikanya
    |

    వెంకటేష్ వరసగా సినిమాలు ఓకే చేస్తున్నారు. తాజాగా ఐతే చిత్రంతో విభిన్న చిత్రాల దర్శకుడుగా ముద్రవేసుకున్న యేలేటి చంద్రశేఖర్ తో చిత్రం చేయటానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. గత సంవత్సరకాలంగా ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చాయని చెప్తున్నారు. డిఫెరెంట్ కాన్సెప్ట్ చేయాలన్న కోరికే యేలేటితో చిత్రం ఓకే చేయటానికి కారణమని వెంకటేష్ సన్నిహితులు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం తేజ, త్రివిక్రమ్ ల దర్శకత్వంలో చిత్రాలు చేయటానికి కమిటయ్యారు. ఇక యేలేటి..ఒక్కడున్నాడు, ప్రయాణం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

    ఇక వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి త్వరలో విడుదల అవుతోంది. చంద్రముఖి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్..సైక్రాటిస్టు గా కనపడి "ఔర ఔర ఔర ఔరా" అనబోతున్నారు. ఈ 'నాగవల్లి' చిత్రంలో అనుష్క, కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, రిచా గంగోపాధ్యాయ కనిపిస్తారు. వెంకటేష్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ ఆప్త రక్షక డైరక్ట్ చేసిన పి.వాసు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. బ్రహ్మానందం, ధర్మవరపు, శరత్ ‌బాబు, అవినాష్‌, ప్రభ, రక్ష, పూనమ్ ‌కౌర్‌, సుజాత తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: గురుకిరణ్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X