ఐతే...! సాయి ధరమ్ తేజ్ సాహసం చేస్తున్నాడా? ఫ్లాపుల దర్శకుడితో మళ్ళీ....

ఐతే వంటి ప్రయోగాత్మక సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి... పకడ్బందీ కథకథనాలతో, కొత్త తరహా చిత్రీకరణతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ.... విమర్శకుల ప్రశంసలు పొందుతూ వస్తున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి..

 సాహసం

సాహసం

"అనుకోకుండా ఓ రోజు", "ఒక్కడున్నాడు", "ప్రయాణం" చిత్రాల తర్వాత ఏలేటి తీసిన సాహసం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలచింది... ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్.. చాలా గ్యాప్ తీసుకున్నాడు.... ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. దశాబ్దంన్నర కిందటే తెలుగు తెరకు చాలా కొత్తగా ఉండే ప్రయోగాత్మక సినిమాలు పరిచయం చేశాడు చంద్రశేఖర్ యేలేటి.

 ప్రతి సినిమా భిన్నమైందే

ప్రతి సినిమా భిన్నమైందే

ఒక "ఐతే".. ఒక "అనుకోకుండా ఒకరోజు".. ఒక "ఒక్కడున్నాడు'.. ఇలా యేలేటి తీసిన ప్రతి సినిమా చాలా భిన్నమైందే. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచిందే. ఐతే అప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా ప్రయోగాత్మక సినిమాలకు అంతగా అలవాటు పడలేదు.

 పెద్ద స్థాయిలో విజయాన్నందుకోలేదు

పెద్ద స్థాయిలో విజయాన్నందుకోలేదు

అవి కమర్షియల్‌గా మరీ పెద్ద స్థాయిలో విజయాన్నందుకోలేదు. దీంతో యేలేటికి అవకాశాలు కూడా ఆశించినంతగా రాలేదు. ఆయన చివరగా చేసిన ‘మనమంతా' మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది కానీ.. కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో అవకాశం కోసం మళ్లీ యేలేటికి ఎదురు చూపులు తప్పలేదు.

మైత్రీ మూవీ మేకర్స్

మైత్రీ మూవీ మేకర్స్

ఐతే ఇప్పుడు యేలేటికి ఓ పెద్ద సంస్థ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘శ్రీమంతుడు'.. ‘జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్లోకి ఘనమైన ఎంట్రీ ఇచ్చిన ‘మైత్రీ మూవీ మేకర్స్'లో యేలేటి ఓ సినిమా చేస్తున్నాడట. ఈ చిత్రంలో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

 ఆసక్తికర కాంబినేషన్

ఆసక్తికర కాంబినేషన్

ఇదే నిజమైతే ఇదొక ఆసక్తికర కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. కెరీర్లో చాలా వరకు ఇమేజ్ లేని హీరోలతోనే పని చేశాడు యేలేటి. అలాంటి వాడు.. స్టార్‌గా ఎదుగుతున్న, పైగా ఎక్కువగా ఫక్తు కమర్షియల్ సినిమాలే చేసిన తేజుతో ఎలాంటి సినిమా చేస్తాడన్నది ఆసక్తికరం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X