పాపం ఎవరిది?....ఆ సినిమాపై కోర్టుకెక్కిన మహిళ!
హైదరాబాద్: మళయాల మూవీ 'చంద్రేట్టన్ ఇవిదేవా' మూలంగా ఓ మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించిన ఆమె చివరకు కోర్టు కెక్కింది. ఇన్నాళ్లు తాను పడ్డ మానసిక క్షోభకు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే...'చంద్రేట్టన్ ఇవిదేవా' చిత్రంలో ఓ ఫోన్ నెంబర్ ప్రదర్శించారు. వాస్తవానికి ఆ ఫోన్ నెంబర్ తిరువనంతపురంలో డ్రైవింగ్ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల మహిళకు సంబంధించినది. సినిమాలో ఆ ఫోన్ నెంబర్ ప్రదర్శించడంతో రాత్రి పగలు తేడా లేకుండా ఆమెకు ఎక్కడెక్కడి నుండో ఫోన్లు రావడం మొదలయ్యాయి. కొందరు ఫోన్లు చేసి బూతులు మాట్లాడేవారు. దీంతో ఆమెకు మనశ్శాంతి కరువైంది.

'చంద్రేట్టన్ ఇవిదేవా' సినిమాలో తన ఫోన్ నెంబర్ ప్రదర్శించడం వల్లనే ఇదంతా జరిగిందని గమనించిన ఆమె....తొలుత సినిమాకు సంబంధించిన వారిని సంప్రదించింది. వాళ్లు ఆమెను లెక్క చేయలేదు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. వారి సలహాపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇన్ని రోజులు తాను అనుభవించిన మానసిక క్షోభకు, ఎదుర్కొన్న అవమానాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కింది.
సదరు మహిళ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ కేసు విచారణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ వ్యవహారంలో పాపం ఎవరిది? నిర్మాతదా? లేక దర్శకుడిదా? ఆ ఫోన్ నెంబర్ ఎలా సినిమాలోకి వచ్చింది అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications