చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'చంద్రోదయం'. వెంకట రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి.జె రాజేంద్ర నిర్మాత. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో వినోద్ నువ్వుల నటిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే అచ్చం చంద్రబాబును చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో భాస్కర్ నటిస్తున్నారు.

'దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నామని తెలిపారు.

Chandrodayam movie first look released

చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు తెదేపాకు ఆయన వెన్నెముక అనే విషయాన్ని చాటి చెప్పడమే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశ్యమని, ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు, టీడీపీ పార్టీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అనే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Chandrodayam movie first look released

ప్రస్తుతం ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా.... వీటితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ సైతం వస్తుండటం చర్చనీయాంశం అయింది. ఈ మూడు సినిమాలు ఏపీలో 2019 ఎన్నికలను ఎంతో కొంత ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X