పవన్ 'జన సేన' బహిరంగ సభ వేదిక మార్పు

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ స్ధాపించిన 'జన సేన' తొలి బహిరంగ సభ ఈ నెల 27న విశాఖలో జరగనుంది. ఈ సభను బీచ్ రోడ్డులో నిర్వహించాలని భావించినప్పటికీ జిల్లా అధికారులు అందుకు అనుమతి నిరాకరించరు. దీంతో వేదికను వన్ టౌన్ లోని ఇందిరా ప్రియదర్శని(మున్సిపల్) స్టేడియంకు మార్చారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయటాననికి అక్కడ పార్టీ ప్రతినిధులకు సమాచారం పంపారు. భారీగ జన సమీకరణ చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాట ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పవన్ అభిమానులు వస్తారని స్ధానిక ప్రతినిధులు చెప్తున్నారు. ఈ వేదికపై పార్టి విధి విధానాలు వివరించే అవకాశం ఉంది. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ బిజేపీ తో దోస్తీ దిసగా మరో అడుగు ముందుకు వేసారు. శుక్రవారం సాయింత్రం అహ్మదాబాద్ లో బిజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోదీతో పవన్ భేటీ అవుతున్నారు.

pawan kalyan janasena

ఇక పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన కొత్త పార్టీ జనసేన తన విధానాన్ని ప్రకటించింది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుందని వెల్లడించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని పేర్కొంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవుదినాలుగా పాటించాలని నిర్ణయించింది.

జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టించినవే తప్ప జాతి సమగ్రత కోసం ఉద్దేశించినవి కావని జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయాల్లో నూతననాయకులను తయారుచేసే దిశగా పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని, సమాజంలో పునాది స్థాయినుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది కల్యాణ్‌ లక్ష్యమని స్పష్టం చేసింది.

పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటికే వందల మంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్న జనసేన పార్టీ నెమ్మదిగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X