రవితేజ అనూష్క కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్స్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తోంది. దాని పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ వెళుతున్నారు. ఈ సినిమాకి ముందుగా ఆనంద్ ఫేమ్ రాధాకృష్ణన్ కొన్ని పాటలు స్వరపరిచారు. కాని ఇప్పుడు అతన్ని తొలిగించి మణిశర్మని పెట్టుకున్నారట. బ్యాలెన్స్ ఉన్న మూడు పాటలు ఆయన స్వరపరుస్తాడట. సరైన టైమ్ కి ట్యూనులు ఇవ్వటంలో రాధాకృష్ణన్ తో సమస్య వచ్చింది అని యూనిట్ వాళ్ళు అంటున్నారు. కాని భలే దొంగలు ఆడియో మిజరబుల్ ఫ్లాప్ దీనికి కారణమని తెలుస్తోంది. కారణాలు యేమైనా ఇలా సగంలో సంగీత దర్శకుడిని మార్చటం మంచి పద్దతి కాదంటున్నారు అంటున్నారు సినీ శ్రేయాభిలాషులు.
Story first published: Sunday, May 17, 2026, 5:31 [IST]