twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవార్డ్ కోసం స్కాచ్ పంపారు, నంది అవార్డులంటే కులాన్ని బట్టి ఇస్తారా?: చంటి అడ్డాల

    |

    Recommended Video

    అవార్డ్ కోసం స్కాచ్ పంపారు !

    నంది అవార్డ్స్ రచ్చ ఏ రెంజి లో టాలీవుడ్‌ని ఊపేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్ర‌క‌టించిందో కానీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు తెలుగు సినీ ప్ర‌ముఖులు నంది అవార్డు పై బ‌హిరంగంగానే అసంతృప్తిని తెలియ ప‌ర్చారు.

     అవార్డ్స్ ఇచ్చిన క‌మిటీ

    అవార్డ్స్ ఇచ్చిన క‌మిటీ

    నంది అవార్డుల ఎంపిక‌లో మొత్తం ఒకే సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని.. నంది అవార్డ్స్ క‌మెటీ పై సినీ వ‌ర్గీయులు పెద‌వి విరుస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కూడా నంది అవార్డ్స్ ఇచ్చిన క‌మిటీ పై వ్యంగంగా స్పందిచిన విష‌యం తెలిసిందే.

    పక్షపాత ధోరణి

    పక్షపాత ధోరణి

    వచ్చిన అవార్డుల విషయంలో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.. ఇక ఆ క్రమం లో పాత విషయాలని కూడా బయటపెడుతున్నారు గతంలో జ్యూరీ మెంబర్లుగా ఉన్నవాళ్ళ అనుభవాలు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి.

    జ్యూరీ తంతు చూస్తుంటే

    జ్యూరీ తంతు చూస్తుంటే

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది" అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు.

    చారిత్రాత్మక సినిమా

    చారిత్రాత్మక సినిమా

    ఇంకా మాట్లాడుతూ "మనం" వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం' లాంటి కమర్షియల్‌ సినిమాతో పాటు ఎన్నో హిట్‌ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా?

    ఇష్టమొచ్చిన సినిమాలకు అవార్డులిచ్చేస్తే

    ఇష్టమొచ్చిన సినిమాలకు అవార్డులిచ్చేస్తే

    "సెలక్షన్‌ కమిటీ మన చేతిలో ఉంది కదా" అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్‌గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు.

    జ్యూరీ సభ్యుడిగా ఉన్నప్పుడు

    జ్యూరీ సభ్యుడిగా ఉన్నప్పుడు

    2013 సంవత్సరంలో నేను జ్యూరీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓ పెద్దమనిషి మా ఇంటికి స్కాచ్‌బాటిల్‌ పంపించాడు. అంటే బాటిల్‌ తీసుకొని అతడి సినిమాను అవార్డుల ఎంపిక విషయంలో పాజిటివ్‌ ఉండాలనేది ఆయన భావన కావచ్చు. జ్యూరీ సభ్యుల మొదటి మీటింగ్‌ తరువాత రెండో మీటింగ్‌కు వెళ్లలేదు.

    వారి సన్నిహితులకు ఇస్తారా

    వారి సన్నిహితులకు ఇస్తారా

    నేను తరువాత జరిగిన మీటింగ్‌కు కూడా వెళ్లకుండా వదిలేశాను. నంది అవార్డులంటే కులాన్ని బట్టి ఇస్తారా? లేక ఎవరి ప్రభుత్వం ఉంటే వారి సన్నిహితులకు ఇస్తారా? టాలెంట్‌ను బట్టి ఇస్తారా? అనే విషయాలు అర్థం కావడం లేదు.

    మూడు సంవత్సరాల తర్వాత

    మూడు సంవత్సరాల తర్వాత

    మూడు సంవత్సరాల తర్వాత ప్రకటించిన ఈ అవార్డులకు సంబంధించిన లిస్ట్‌ ముందే తయారు చేశారా? లేక సినిమాలు చూసి అవార్డుల కోసం లిస్ట్‌ తయారు చేశారో అర్థం కాని పరిస్థితులున్నాయి. ఒకసారి ప్రేమ సినిమాకు బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా నాకు వచ్చిన అవార్డును ప్రకటించి వెనకకు తీసుకున్నారు. ఎలాంటి కారణాలతో ఈ అవార్డు వెనక్కు తీసుకుంటారని ప్రశ్నించారు.

    English summary
    Chanti Addala is a Tollywood producer and director shared a memory when hi was a jury member of Andhra pradesh Nandi Awards Committee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X