థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డప్పుకొట్టుకున్న చంటి!
మోహన్‌బాబు 'ధర్మపోరాటం' సినిమాకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా వెళ్లా. ఆ సినిమాకి మోహన్‌బాబు ఇచ్చిన ఆరు వందల రూపాయలే నా తొలి పారితోషికం. వెంకటేశ్, రేవతి సినిమా 'ప్రేమ'తో ఆర్ట్ డైరెక్టర్‌గా పరిచయమయ్యా. అది కూడా 'రక్త తిలకం', 'బ్రహ్మపుత్రుడు' సినిమాలకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా నేను వేసిన సెట్స్ నచ్చి ఆ అవకాశం ఇచ్చారు. తెలుగు, హిందీ, కన్నడంలో కలిపి ఇప్పటివరకు 174 సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేశా. 'ధర్మచక్రం', 'ఆరో ప్రాణం' చిత్రాలకు ఉత్తమ కళా దర్శకుడిగా నంది అవార్డులు తీసుకున్నా. తక్కువ బడ్జెట్‌తోటే సృజనాత్మకంగా, అందంగా సెట్‌లు వేయడం నాకు మంచి పేరు తీసుకువచ్చింది. పద్మాలయా స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, రామానాయాడు సినీ విలేజ్, కె.ఎస్. రామారావుకు చెందిన సి.సి. ఫిల్మ్‌సిటీలో తొలి సెట్లు వేసింది నేనే. కళా దర్శకుడిగా నా చివరి సినిమా ప్రభాస్‌తో నేనే తీసిన 'అడవి రాముడు' అని వెల్లడించారు.
డైరెక్టర్ అవుదామని కథ సిద్ధం చేసుకుంటున్న నన్ను రూ. 5 లక్షలతో సినిమా చేద్దామంటూ నన్ను ఛాయాగ్రాహకుడు వి. శ్రీనివాసరెడ్డి ఇందులోకి దించాడు. ఆ సినిమా సౌందర్యతో చేసిన 'ఆరో ప్రాణం'. ఐదు లక్షలనుకున్నది దానికి ఎన్నో రెట్లు ఖర్చయింది. అయితే ఆ సినిమా హిట్టవడంతో ఆ ఉత్సాహంలో శ్రీనివాసరెడ్డితో కలిసి మరో మూడు సినిమాలు నిర్మించా. అలా ఫ్రెండ్లీ మూవీస్ బేనర్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం మా బేనర్లో అల్లరి నరేష్ హీరోగా హై బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ చిత్రం నిర్మిస్తున్నాం. ఏ చిత్రంలో చూడని విధంగా ఇందులో యముడి ఇల్లును చూపెట్టబోతున్నాం అని చంటి అడ్డాల చెప్పారు.
అల్లరి నరేష్ సరసన రిచా పనయ్ నటిస్తున్న ఈచిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కోసం రాజమోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 11 భారీ సెట్లు వేశారు. ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












