Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రాజమౌళికి కొత్త ట్విస్టు
రాజమౌళి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదంటూ చంటి అడ్డాల నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మండలి వారు కూడా ఈ విషయం తేలేవరకూ రాజమౌళిపై నిషేధం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. ఇక ప్రస్తుతం చంటి అడ్డాల తన వద్ద తీసుకున్న ఐదు లక్షలు అడ్వాన్స్ కు రాజమౌళి సినిమా డైరక్ట్ చేసి పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాకాని పక్షంలో తన ఇచ్చిన మొత్తానికి వడ్డీ వేసి పాతిక లక్షలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
అయితే అంతకు ముందు రాజమౌళి ఆ మొత్తానికి మూడు రూపాయల వడ్డీతో అతనికి చెక్కులు ఇచ్చారు. కానీ చంటి అడ్డాల మాత్రం రాజమౌళి తన చిత్రాన్ని డైరర్ట్ చేస్తానని డబ్బు తీసుకున్నారు కాబట్టి ఆ మాట ప్రకారం తన చిత్రానికి డైరక్ట్ చేయాలనే పట్టుపడుతున్నారుట. దాని వల్ల తాను చాలా నష్టపోయానని, పలువురుకు రాజమౌళితో సినిమా అని చెప్పుకున్నానని ఆ సమస్యకు పరష్కారం రాజమౌళి తనతో సినిమా చేయటమే నంటున్నాడు. ఇక కొందరు పెద్దరికంగా మధ్యవర్తిత్వం చేసినా వర్కవుట్ కాలేదు.
ఇక చంటి అడ్డాలకీ నిర్మాతగా ఇప్పటివరకూ బ్యాడ్ నేమ్ అయితే లేదని,న్యాయంగానే ఆయన డైరక్ట్ చేయాలని కోరుతున్నాడని ఓ వర్గం అంటోంది. అవసరమైతే చంటి అడ్డాల తరుపున పోరాటం చేయటానికి రెడీ అంటున్నారు. అప్పట్లో స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఖాళీగా ఉన్న రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చినా ఆ కృతజ్ఞత లేదని వారు వాదిస్తున్నారు. కేవలం పెద్ద ప్రొడ్యూసర్స్ కే సినిమాలు చేస్తూ ఇలా తమవంటి వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఆ నిర్మాతలు వాదిస్తున్నారు. ఆ నిర్మాతలు గతంలో రాజమౌళితో సినిమా చేయాలని ఆశపడి వర్కవుట్ కానివారేనని ఇది విన్న వారు కామెంట్స్ చేస్తున్నారు.