twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్తి అగర్వాల్ డెత్ మిస్టరీ: ఆమె అలా అవడానికి అతడే కారణం.. సంచలన విషయాలు లీక్ చేసిన తెలుగు నిర్మాత

    |

    ఆర్తి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరిది. 'నువ్వు నాకు నచ్చావ్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని హీరోలు అందరితోనూ నటించింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న సమయంలోనే పలు వివాదాల కారణంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. చివరికి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్తి అగర్వాల్ మరణంపై తెలుగు ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

    అలా మొదలైన ప్రయాణం.. తెలుగులో టాప్

    అలా మొదలైన ప్రయాణం.. తెలుగులో టాప్

    'పాగల్పన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది ఆర్తి అగర్వాల్. ఆ వెంటనే రెండో చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్' ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి 'నువ్వు లేక నేను లేను', 'ఇంద్ర', 'వసంతం', 'వీడే', 'సంక్రాంతి', 'అందాల రాముడు', 'అల్లరి రాముడు', 'అడివి రాముడు' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తద్వారా టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది.

    ఆత్మహత్యాయత్నం.. లవ్ స్టోరీనే కారణమని

    ఆత్మహత్యాయత్నం.. లవ్ స్టోరీనే కారణమని

    సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో ఆమెను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పట్లో దీనిపై ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆమె ఓ హీరోతో ప్రేమాయణం సాగించిందని.. అతడితో వివాదం కారణంగానే సూసైడ్‌కు యత్నించిందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి.

    అతడితో వివాహం.. రెండేళ్లకే విడిపోయిందిగా

    అతడితో వివాహం.. రెండేళ్లకే విడిపోయిందిగా

    వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్.. ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, అది జరిగిన రెండేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చేసిందామె. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, కొన్ని సినిమాలు విడుదల కాకుండానే ఆగిపోయాయి.

    ఆర్తి అగర్వాల్ ఆకస్మిక మరణం.. రిపోర్టు ఇలా

    ఆర్తి అగర్వాల్ ఆకస్మిక మరణం.. రిపోర్టు ఇలా

    సినిమాల అవకాశాలు లేకపోవడం.. భర్తతో విడాకులు.. కొన్ని వ్యక్తిగత వివాదాల కారణంగా డిప్రెషన్‌కు లోనై బాగా లావైపోయింది ఆర్తి అగర్వాల్. దీంతో ఆమె బరువు తగ్గేందుకు కొన్ని సర్జరీలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలోనే 2015 జూన్ 6న గుండెపోటుతో మరణించింది. కార్డిక్ అరెస్ట్ కారణంగానే ఆమె మృతి చెందినట్లు అట్లాంటీ కేర్ సెంటర్ వైద్యులు రిపోర్టును ఇచ్చారు.

    సంచలన విషయాలు లీక్ చేసిన ప్రొడ్యూసర్

    సంచలన విషయాలు లీక్ చేసిన ప్రొడ్యూసర్

    తెలుగులో చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొంది.. ఊహించని విధంగా దివికేగిన ఆర్తి అగర్వాల్ మరణం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్ చంటి అడ్డాల తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చర్చించారు. అదే సమయంలో ఆమె మరణం వెనుక ఉన్న కొన్ని సంచలన విషయాలను లీక్ చేశారు. ఆమెతో 'అల్లరి రాముడు', 'అడవి రాముడు' వంటి చిత్రాలను తెరకెక్కించారాయన.

    ఎన్టీఆర్ కోసం ఆమెను తీసుకోవాల్సి వచ్చింది

    ఎన్టీఆర్ కోసం ఆమెను తీసుకోవాల్సి వచ్చింది

    ఆర్తి అగర్వాల్‌తో పరిచయం గురించి చెబుతూ.. 'అల్లరి రాముడు సినిమాకి ఫస్ట్ చార్మిని తీసుకున్నాం. ఎన్టీఆర్, ఛార్మి లావుగా ఉంటే కష్టమని చర్చించుకున్నాం. సరిగ్గా అప్పుడే టాలీవుడ్‌లోకి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ను తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. అందుకు తగ్గట్లుగానే ఆమెతోనే సినిమా చేశాం. ఆ తర్వాత 'అడవి రాముడు'లో ప్రభాస్ కోసం తీసుకున్నాం' అని చంటి చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
    ఆమె అలా అవడానికి అతడే కారణం అంటూ

    ఆమె అలా అవడానికి అతడే కారణం అంటూ

    ఆర్తి అగర్వాల్ సమస్యలకు.. అలా అయిపోడానికి ఆమె తండ్రే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంటి. 'ఆర్తి సెట్స్‌లో చాలా సరదాగా ఉండేది. కానీ, ఆమె తండ్రి వస్తే మాత్రం ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఆయన ప్రభావం ఆమెపై బాగా ఉంది. సినిమాలే కాదు.. కెరీర్‌పైనా ఆయన ఇష్టం వచ్చినట్లే చేసేవారు. అందుకే ఆర్తి అగర్వాల్ అలా అయిపోయింది' అంటూ వెల్లడించారాయన.

    English summary
    Agarwal was born on 5 March 1984 in New Jersey to Gujarati parents. Her father, Shashank, is in the hotel business and her mother, Veema, is a homemaker. She has two siblings. At around 14 years of age, actor Sunil Shetty spotted her and invited her to dance on stage in Philadelphia, Pennsylvania.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X