జగన్‌‌‌కు ఏం తెలియదు .. సజ్జల, సుబ్బారెడ్డి‌లతో మొరపెట్టుకున్నా.. వైసీపీ పరిస్ధితి ఇదే : బోల్డ్ హీరోయిన్ హాట్

బోల్డ్ క్యారెక్టర్లతో పాపులర్ అయిన రమ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఆమె తర్వాతి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యింది. ఆమె అసలు పేరు సుజాత.. అయితే అప్పటికే ఇండస్ట్రీలో ఆ పేరు గల వారు ఉండటంతో తన స్టేజ్ నేమ్‌ను రమ్యశ్రీగా మార్చుకుంది. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆమె మాతృభాష కంటే కన్నడంలో హీరోయిన్‌గా రాణించింది. దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి చిత్రాలలో 300 వరకు సినిమాల్లో నటించారు రమ్యశ్రీ.

సినిమాలలో బిజీగా ఉంటూనే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేశారు రమ్యశ్రీ. నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని అప్పట్లో ఆమె చెప్పింది. తెలుగులో ఓ మల్లి చిత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని , నటనలోనే కాకుండా స్క్రీన్ ప్లే, దర్శకత్వ రంగాల్లో తనకు అనుభవం ఉందని ఆమె అంటూ ఉంటారు. సొంతంగా ఓ ఫౌండేషన్ స్థాపించిన రమ్యశ్రీ.. దాని ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారు. మహిళలు ప్రసవ సమయంలో మృత్యువాత పడుతుండటం ఈ అంశంపై అవగాహన కల్పించడంతో పాటు వైద్య శిబిరాలను కూడా ఆమె ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

character actress ramya sri made sensational comments on ysrcp chief ys jagan mohan reddy

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రజంట్ రాజకీయాలపై విషయాలను పంచుకున్నారు రమ్యశ్రీ. మన వద్దకు ఏదో అవసరం ఉండి వచ్చిన జనానికి అండగా నిలవలేనప్పుడు లీడర్‌షిప్ వేస్ట్ అని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీల పరంగా ఎక్కడా తాను ఆలోచించలేదని.. అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం, బిల్‌క్లింటెన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం తదితర అంశాలతో ఆయనను అభిమానించినట్లు రమ్యశ్రీ తెలిపారు.

వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయెంబర్స్‌మెంట్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయని.. తాను ఆసుపత్రుల్లో సామాన్యులను దీనిని అడిగితే వైఎస్‌ను దేవుడిలా చూసేవారని ఆమె వెల్లడించారు. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కుయ్.. కుయ్ అని వెహికల్స్ పరుగులు తీసేవని ఏంటని అడిగితే 108 అని.. ఐదు నిమిషాల్లో స్పాట్‌కి వచ్చేస్తుందని చెప్పేవారని రమ్యశ్రీ పేర్కొన్నారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్ ఓదార్పు యాత్రలతో నిత్యం జనంలో ఉండేవారని, సర్వీస్ బాగా చేస్తున్నారని అనుకున్నానని ఆమె చెప్పింది.

character actress ramya sri made sensational comments on ysrcp chief ys jagan mohan reddy

జగన్‌ను ఎయిర్‌పోర్టులో ఒకటి రెండు సార్లు చూశానని.. కానీ ఆయనను నేరుగా కలిసింది లేదని రమ్యశ్రీ వెల్లడించింది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో పాటు జగన్ పనులతో ఇంప్రెస్ అయిన తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానన్నారు. అయితే తాను పార్టీలో ఎందుకు చేరాను, నా ఇంటెన్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు కింది స్థాయి కేడర్, ఎమ్మెల్యేలతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని..వారితో పోలిస్తే తానెంతని రమ్యశ్రీ ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులతో తన ఆవేదనను తెలియజేశానని.. ప్రతీసారి చూద్దాం అనే వారు తప్పించి ఫలితం శూన్యమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రమ్యశ్రీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X