డబ్బులిస్తా అంటూ అక్కడ చేయి పెట్టాడు.. నడిరోడ్డుపై యూట్యూబర్ని చితకొట్టిన కరాటే కళ్యాణి!

ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా నడిరోడ్డుపై ఒక యువకుని బట్టలు చినిగిపోయే విధంగా చితకబాదడం అందరిని ఆశ్చర్యానికి కలుగజేసింది. అతను మహిళల పట్ల అగౌరవ పరిచేలా ప్రవర్తిస్తున్నాడు అని అంతేకాకుండా తనతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించి డబ్బులు కూడా ఇస్తాను ఉన్నాడు అని ఆరోపించింది. అసలు యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి కి సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కి మధ్య లో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

అగౌరపరిచేలా ఉన్నాయని..

అగౌరపరిచేలా ఉన్నాయని..

నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కరాటే కళ్యాణి మధ్యలో కొన్ని కాంట్రవర్సీ విషయాలపై కూడా ఘాటుగా స్పందించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఒక యూట్యూబర్ చేస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏ మాత్రం కరెక్ట్ గా లేవు అంటూ అవన్నీ కూడా హిందువులను అలాగే మహిళలను అగౌరపరిచేలా ఉన్నాయని ఆమె ఊహించని విధంగా అతని పై దాడి చేసింది.

నడిరోడ్డుపై దాడి

నడిరోడ్డుపై దాడి

హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో శ్రీకాంత్ రెడ్డి వెళుతుండగా.. డైరెక్ట్ రోడ్డుమీదే అతన్ని ఆపి కళ్యాణి ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అంతేకాకుండా కరాటే కళ్యాణి అతని పై చేయి కూడా చేసుకుంది. ఈ తరుణంలో కరాటే కళ్యాణి అనుచరులు కూడా అతనిపై ఊహించని విధంగా దాడి చేశారు

శ్రీకాంత్ రెడ్డి కూడా..

శ్రీకాంత్ రెడ్డి కూడా..

అయితే శ్రీకాంత్ రెడ్డి కూడా తనపై దాడి చేసినందుకు కరాటే కళ్యాణి పై కూడా రివర్స్ అయ్యాడు. అతను కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా కరాటే కళ్యాణి తో వచ్చిన మరొక వ్యక్తిపై కూడా శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. ఇక వీరి గొడవను చూసి స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు నన్ను కొట్టడానికి నీకు ఏమీ హక్కు ఉందని కరాటే కళ్యాణిని శ్రీకాంత్ రెడ్డి అక్కడే ప్రశ్నించే ప్రయత్నం చేశాడు.

ప్రాంక్ వీడియోల పేర్లతో..

ప్రాంక్ వీడియోల పేర్లతో..

అయితే ప్రాంక్ వీడియోల పేర్లతో ఆంటీల అంటూ అసభ్యంగా యూట్యూబ్లో చూపిస్తున్నాడు అని ఇష్టం వచ్చినట్లు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటూ.. అందుకే చేయి చేసుకున్నట్లుగా కరాటే కళ్యాణి వివరణ ఇచ్చింది అంతేకాకుండా తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని కొన్నిసార్లు ఎక్కడపడితే అక్కడ చేయి వేశాడు అని కూడా ఆమె ఆరోపించింది

నడుముపై చేయి వేయడంతో..

నడుముపై చేయి వేయడంతో..

డబ్బులు ఇస్తాను అంటూ తనతో శృంగారం చేయాల్సిందిగా కూడా శ్రీకాంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడారు అని అంతేకాకుండా నడుముపై చేయి వేయడంతో నేను అప్పుడే అతని పై రివర్స్ అయినట్లుగా కరాటే కళ్యాణి తెలియజేసింది. ఇక కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ తరుణంలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా కూడా చినిగిపోయింది. అయితే తాను తప్పు చేసి ఉంటే పోలీస్ కేసు పెట్టాలి అంతే కానీ తన పై చేయి చేసుకునే హక్కు ఎవరు ఇచ్చారు అంటూ శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణిని ప్రశ్నించారు.

ఆమె అలా చేస్తే తప్పు లేదా?

ఆమె అలా చేస్తే తప్పు లేదా?

ఇక శ్రీకాంత్ రెడ్డి తాను ఫ్రాంక్ వీడియోలు చేసేది కేవలం ఒక డ్రామా మాత్రమే అంటూ పెయిడ్ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నట్లుగా వివరణ ఇచ్చాడు. అయితే కరాటే కళ్యాణి బాబీ అంటూ వ్యాంప్ పాత్రలు చేస్తే తప్పు లేదు.. అలాగే సినిమాల్లో ఊ అంటావా..ఊ ఊ అంటావా అనే పాటలు ఉన్నా తప్పులేదు కానీ నేను ఇలా ప్రాంక్ వీడియోలు చేస్తే తప్పు వచ్చిందా అని ప్రశ్నించాడు.

ఇక ఈ గొడవ జరిగిన అనంతరం కరాటే కళ్యాణి గొడవకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. అనంతరం ఇద్దరు కూడా సమీప పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X