షూటింగ్ లోనే స్టార్ కమెడియన్ తప్పుగా ప్రవర్తించాడు, కారావ్యాన్ లోకి తీసుకెళ్లి.. నటి ప్రగతి షాకింగ్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కుర్రాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అది కామన్. అయితే అప్పుడప్పుడు సీనియర్ నటీమణులు కూడా వారి అందంతో కుర్రాళ్లను పాజిటివ్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే సైడ్ క్యారెక్టర్లు చేసే వారు కొన్నిసార్లు ఊహించని విధంగా కనిపించేసరికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఓ వర్గం ఆడియెన్స్ ని తన లుక్స్ తో తెగ ఎట్రాక్ట్ చేసింది.
Recommended Video

లుంగీ డ్యాన్స్ చేసి షాకిచ్చింది..
అమ్మ, అత్త, వదిన..ఇలా రకరకాల సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన ప్రగతి ఇటీవల లాక్ డౌన్ లో ఎవరు ఊహించని విధంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. లుంగిలో తీన్మార్ స్టెప్పులతో ఈ సీనియర్ నటీమణి చేసిన రచ్చ మామూలుగా లేదు. దెబ్బకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అసలు ఈ రేంజ్ లో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు నమ్మలేదు.

అందంతోనే..
నటి ప్రగతిని చూడగానే ఎవరైనా సరే అలా చూస్తూ కొన్ని నిమిషాల పాటు కదలకుండా ఉండిపోతారు. ఆమె వయసు 44అంటే ఎవరు నమ్మలేరు. ఈ వయసులో కూడా ఇంకా తన హోమ్లీ అందంతో కట్టిపడేస్తుంది. ఇక అందంగా కనిపించడానికి ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందట. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని చెబుతోంది.

సీనియర్ మోస్ట్ యాక్టర్ మిస్ బిహేవ్..
ఒక ఇంటర్వ్యూలో ప్రగతి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది. ఒక సీనియర్ మోస్ట్ కమెడియన్ తనతో తప్పుగా ప్రవర్తించడాని సినిమా షూటింగ్ జరుగుతుండగా అతని ప్రవర్తన మునుపటిలా కనిపించలేదని చెబుతూ.. అతని మాటల్లో, చేష్టాలు నన్ను ఇబ్బంది పెట్టాయని ప్రగతి తెలిపింది. వెంటనే అతనికి క్లారిటీగా ఆ విషయాన్ని కూడా చెప్పాలనుకున్నట్లు వివరణ ఇచ్చింది.

కారావ్యాన్ లోకి తీసుకెళ్లి..
"ఆ స్టార్ కమెడియన్ వర్క్ అయిపోయిన తరువాత అతనికి నా ఆలోచన గురించి చెప్పాలని అనుకున్నాను. వెంటనే కారావ్యాన్ లోకి తీసుకెళ్లి నేను పడుతున్న ఇబ్బంది గురించి చెప్పా. మీరు ప్రవర్తన ఏ మాత్రం బాలేదు. ఇది మంచిది కాదు అని చెప్పా. వెంటనే అతను సైలెంట్ గా వెళ్లిపోయాడు. ఆ తరువాత నా గురించి ఆమెకు చాలా పొగరు" అని ఆ స్టార్ట్ కమెడియన్స్ వేరే వాళ్లకు చెప్పినట్లు ప్రగతి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











