దర్శక రచయిత పోసాని హీరోగా మారి సినిమా చేస్తున్న సంగతి తెలుసిందే. ఆయన సరసన నటించటానికి హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ హీరోగాని ఆయన సరసన చేస్తే తమ తర్వాత తమ కెరీర్ ఏమవుతుందనే భయంతో చాలామంది వెనకడుగు వేసారు. దాంతో తన పరిస్ధితీ రాజశేఖర్ లా మారేలా ఉందని అనుకుంటుంగా ఆయనకి హీరోయిన్ దొరికింది. ఆమె మరెవరో కాదు...ఆనంద్ సినిమాలో కొద్దిగా జీర గొంతుతో మాట్లాడుతూ కమిలినీ ముఖర్జీకి మోరల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితురాలు పాత్రలో కనపడిన సత్య కృష్ణన్. ఆమె బొమ్మరిల్లు లో హీరో అక్కగా చేసింది.ఏ పాత్ర చేసినా మంచి మార్కులు తెచ్చుకునే ఆమె కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి అవకాసాలే వస్తున్నాయి .అలాగే ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. అంటే ఫక్తు యాక్షన్ సినిమాలతో వెళ్ళే శ్రీహరి లాంటి వాళ్ళకు మరో హీరోయిన్ దొరికినట్లే ...