Surekha Vani: నైట్ క్లబ్‌లో బర్త్ డే పార్టీ.. కూతురుతో కలిసి తగ్గేదేలే అంటూ హంగామా

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖ వాణి ఒకరు. ఆమెతోపాటు కూతురు సుప్రీతా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇంకా ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే తరచుగా సుప్రీత సురేఖ వాణి ఇద్దరు కూడా కొన్ని స్పెషల్ పార్టీలలో పాల్గొంటూ ఉంటారు. ఇక రీసెంట్గా వీరిద్దరూ పాల్గొన్న ఒక పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో సుప్రీతా సురేఖ వాణి గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలు చేసిన సురేఖ వాణి అతి తక్కువ కాలంలోనే చాలా బిజీగా మారిపోయింది. ముఖ్యంగా కామెడీ సినిమాల్లో ఆమె చాలా మంచి పాత్రలు చేసింది. అప్పట్లో శ్రీనువైట్ల సినిమాల్లో ఆమె ఎక్కువగా కనిపించేవారు. హీరోలకు అక్క పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.

మంచి నటిగా

మంచి నటిగా

2004 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. అతనొక్కడే, భద్ర, అశోక్.. ఇలా అగ్ర హీరోల సినిమాల్లో మంచి పాత్రలలో నటించి ఆ తర్వాత చాలా తొందరగానే బిజీ అయిపోయారు. ఇక దుబాయ్ శీను, రెడీ, ఢీ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును అందించాయి. ఆ తర్వాత సీమటపాకాయ్ దూకుడు దరువు సినిమాల్లో కూడా మంచి కామెడీ టైమింగ్ తో మెప్పించారు.

తల్లి ద్వారా కూతురు ఫేమస్

తల్లి ద్వారా కూతురు ఫేమస్

ఇక సురేఖ వాణి తరచుగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఆమెకు పాతికేళ్ల కూతురు ఉంది అని అంటే ఎవరు అంత ఈజీగా నమ్మరు. కానీ సోషల్ మీడియాలో తన కూతురుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె తరచుగా పోస్ట్ చేస్తూ ఉంటారు. సురేఖ వాణి ద్వారా ఆమె కూతురికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ట్రోలింగ్

ట్రోలింగ్

సుప్రీత తన స్నేహితులతో తరచుగా పార్టీలలో పాల్గొంటే అందులో తన తల్లి సురేఖవాణి కూడా పాల్గొనేలా చేస్తుంది. అసలు వీరిద్దరూ గ్లామరస్ డ్రెస్సులలో అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటే కొంత ట్రోలింగ్ కూడా గురి అవుతూ ఉంటారు కానీ వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా వారికి నచ్చిన జీవనశైలిలో కొనసాగిస్తూ ఉంటారు.

బర్త్ డే పార్టీలో..

బర్త్ డే పార్టీలో..

మన జీవితం అనేది మనకు నచ్చినట్లుగా ఉండాలి అని సురేఖవాణి తరచుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఇటీవల సుప్రత పుట్టినరోజును ఆమె గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో వారి స్నేహితులు కూడా పాల్గొన్నారు. అయితే ఒక శాంపేయన్ బాటిల్ను పొంగించిన సురేఖ వాణి తన కూతురుకి స్వయంగా తాగించింది.

 గ్లామరస్ అందాలతో..

గ్లామరస్ అందాలతో..

సురేఖ వాణి సుప్రీత ఇద్దరు కూడా గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒక విధంగా వీరిద్దరిని చూస్తే తల్లి కూతుళ్ళలా లేరు అని అక్కాచెల్లెళ్ల తరహాలో ఉన్నారు అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా వీరి పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక త్వరలోనే సుప్రీత కూడా ఇండస్ట్రీలో నటిగా కొనసాగే విధంగా అడుగులు వేయబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X