»   » పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి రెడీ: జూ ఎన్టీఆర్ ప్రియురాలు

పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి రెడీ: జూ ఎన్టీఆర్ ప్రియురాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు సమీరా రెడ్డి. స్వతహాగా తెలుగు అమ్మాయి అయినటువంటి సమీరా రెడ్డి, ముంబయిలో పుట్టి పెరగడం వల్ల పాస్ట్ కల్చర్‌కు బాగా అలవాటు పడినట్లు ఉన్నారు. అందుకేనేమో నగ్నంగా నటించడానికి సైతం ఓకే అంటూ చేతులు ఊపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు లాంటి చిత్రాలలో నటించినటువంటి సమీరా రెడ్డి ఆతర్వత చిరంజీవితో జైచిరంజీవలో నటించడం జరిగింది. ఆసినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో ఇక మరలా తెలుగు సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఎర్రగులాబీలు సినిమాతో మరలా మన ముందుకు వస్తున్నారు. ఏమి మాయచేశావే సినిమాకి దర్శకత్వం వహించినటువంటి గౌతమ్ మీనన్ ఈసినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

పూర్వం ఒకప్పటి సినిమాల్లో హీరోయిన్ జాకెట్ లోపల బ్రా వేసిందన్న ఆనవాలు లీలగా కనిపించినందుకే నానా గొడవ చేశారు ఆ నాటి పెద్దలు. మామూలుగా అయితే ఆ రోజుల్లో అదే అశ్లీలం. ఇప్పుడా పెద్దలంతా బ్రతికి ఉంటే నేటి మన హీరోయిన్ల డ్రెస్సులూ, బికినీలు,టాప్ లెస్ గా నటించటం చూస్తే బహుశా ఆత్మహత్యలు చేసుకుంటారేమో. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే మన హిందీ హీరోయిన్లు, రాణీ ముఖర్జీ, విద్యాబాలన్, మందిరా బేడీలు ఇప్పటికే టాప్ లెస్ గా కనిపించి ప్రేక్షకులను ఆనందపరిచారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ మరో అడుగు ముందుకు వేసి "నేను నగ్నంగా నటించటానికి రెడీ" అంటోంది సమీరా రెడ్డి. ఇక్కడో చిన్న మతలబు ఉందండోయ్ "కళాత్మక చిత్రంలో, పాత్ర డిమాండ్ చేస్తేనే నేను నగ్నంగా నటిస్తాను" అని అంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu