'జులాయి' చిత్రం పాత్రలు - పరిచయం
హైదరాబాద్: అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఆగస్టు 9న విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పాత్రలు..వాటి పేర్లు ఏమిటంటే..
నటుడు--- పాత్ర పేరు
అల్లు అర్జున్--- రవి
ఇలియానా--- మధు
రాజేంద్రప్రసాద్--- సీతారాం(పోలీస్)
సోనూ సూద్--- బిట్టు
రావు రమేష్--- రాజా మాణిక్యం (పోలీస్)
కోట శ్రీనివాసరావు--- వరదరాజులు
తణికెళ్ల భరిణి---నారాయణ మూర్తి
బ్రహ్మానందం--- బాబాయ్
ఎమ్.ఎస్ నారాయణ--- వాల్మికి
బ్రహ్మాజి--- ట్రావెల్ మూర్తి
షఫీ--- లాలా
సీతల్ మీనన్--- దేవయాని
తులసి--- కామేశ్వరి
హేమ--- సుజాత
ప్రగతి--- లలిత
ప్రభు--- ప్రభు
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ. అలాగే... జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.


Click it and Unblock the Notifications











