అనుష్క ‘రుద్రమదేవి’లో ఏ పాత్రకు ఎవరు??
ఈ చిత్రంలో పాత్రలు వరసగా...
రాణీ రుద్రమగా....అనుష్క
చాళుక్య వీరభద్రునిగా.... రానా,
గణపతిదేవునిగా.... కృష్ణంరాజు,
శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్,
హరిహరదేవునిగా.... సుమన్
మురారిదేవునిగా... ఆదిత్యమీనన్,
నాగదేవునిగా.... బాబా సెహగల్,
కన్నాంబికగా.... నటాలియాకౌర్,
ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా,
మదనికగా.... హంసానందిని,
అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి,
గణపాంబగా.... అదితి చంగప్ప,
కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్,
టిట్టిబిగా..... వేణుమాధవ్,
ప్రసాదాదిత్యగా .....అజయ్
ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
'అరుంధతి'గా అదరకొట్టిన అనుష్క ఇప్పుడు 'రుద్రమదేవి'గా కెమెరా ముందుకు రావటానికి రెడీ అవుతోంది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ షూటింగ్ మొదలైంది. గుణశేఖర్ మాట్లాడుతూ ''ప్రముఖ కళా దర్శకులు తోట తరణి ఆధ్వర్యంలో ఎరీనా సెట్‌ని తీర్చిదిద్దాం. అక్కడే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. కాకతీయుల వైభవాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తాం. స్టీరియో స్కోపిక్ త్రీడీ విధానంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


Click it and Unblock the Notifications












