‘ఎవడు’ ఆ రీమిక్స్ కూత కూసింది, అబద్దం : రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లు చిత్రంలోని 'బోలో బోలో బోలో రాణి ప్యార్ చాహియే' పాటను రీమిక్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలను రామ్ చరణ్ ఖండించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ పిఆర్ఓ శ్రీనివాస్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఎవడు చిత్రంలో రీమిక్స్ సాంగ్ చేయడం లేదని, మెగాస్టార్ చిత్రాల్లోని పాటల రీమేక్, చిత్రాల రీమేక్ ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసారు.
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా 'ఎవడు' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో తొలుత సమంతను తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెను మార్చి శృతి హాసన్ ను తీసుకున్నారు. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. దీంతో పాటు రామ్ చరన్ తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











