ఓ భగ్నప్రేమికుడి పాటకోసం చరణ్!!
సినిమాల కోసం పాటలు రాసేవారు ఒక రకమైతే, పాట కోసం సినిమా తీసేవారు మరో రకం. ఇదే కోవకే చెందుతారు దర్శకుడు కృష్ణవంశీ 'జగమంతా కుంటుంబం నాది" అనే పాట కోసం ప్రభాస్ తో 'చక్రం" సినిమా తీశారు. మరి ఇప్పుడు అదే కోవలో మరో సినిమా తీయ్యాలనుకొంటున్నారు చరణ్ గారు.
ఆ మధ్య కాలంలో ఓ అజ్ఝాత ప్రేమికుడు తన ప్రియురాలి ప్రేమకోసం 'నా ప్రాణమా నను వీడి పోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా అనితా ఓ అనితా" అనే పాటను రికార్డు చేసి సెల్ ఫోన్ లలో దాన్ని పంపించాడు. ఆ పాట ఉత్తరాంధ్రలో చాలా ప్రాచుర్యం పొందింది. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. ఆ పాట ఉంటేనే ఆటో ఎక్కుతామన్న ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే ఆ పాట ఎవరు రాసింది కొంత కాలం తెలిసిరాలేదు. ఆ పాటపై చాలా న్యూస్ ఛానల్స్ లో కథనాలు వచ్చాయి. అయితే జీ 24 గంటలు వారు. ఆ పాట రాసి పాడిన నాగరాజు అనే యువకుడిని పరిశోధించి కనుగొన్నారు. అతని గురించి టివిలో ఓ ప్రోగ్రామ్ ప్రసారం చేశారు. ఆ కథనం చూసిన నటుడు చరణ్ రాజ్ ఆ ప్రేమికుడిని కలిసి అతని కథ విని దాన్ని సినిమాగా తీయనున్నానని ప్రకటించారు.
ఈ వివరాలను తెలపడానికి ప్రెస్ క్లబ్ లో చరణ్ రాజ్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ మధ్య సినిమాల్లో నటించడం తక్కువ చేశాను. నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా సినిమాలు చేస్తున్నాను. జీ తెలుగు 24 గంటలు లో నేను ఈ నాగరాజు కథనాన్ని చూసి అతన్ని కలవాలని వారితో కలిసి అతనితో మాట్లాడాను. అతని కథ విన్న నాకు దాన్ని సినిమాగా తీయాలని అనిపించిందని తెలిపారు. ఈ సినిమాను నేను వ్యాపారాత్మకంగా చేయడంలేదు. ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరిట యువకులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారో చూస్తున్నాము. నిజమైన ప్రేమంటే క్రూరంగా యాసిడ్ తో దాడి చేయడం కాదు. ప్రేమంటే ఇదీ అని చెప్పనున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేమికులకు ఒక పాఠం లాంటిది. ఇది నిజమైన ప్రేమకథ. ఈ పాట సెల్ ఫోన్ లో సూపర్ హిట్ అయింది. ఒక దర్శకుడిగా ఈ పాట రాసిని నాగరాజు నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు అతనే సంగీత దర్శకుడు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











