ఇడియట్ కాలేక పోయానని చరణ్ అసంతృప్తి!

By Bojja Kumar

ఇడియట్ కాలేక పోయినందుకు రామ్ చరణ్ బాధ పడుతున్నాడా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది టాలీవుడ్ సినీ వర్గాల్లో. ఇటీవల 'స్నేహితుడు' ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న చరణ్ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోంది మరి. ఈ ఆడియో వేడుకలో చరణ్ మాట్లాడుతూ...''హిందీలో 3 ఇడియట్స్ సినిమా విడుదలకు ముందు చూశాను. నిర్మాతలు నన్ను అడిగారు ఈ సినిమా తెలుగులో చేస్తారా? అని, అయితే ఆ సినిమా అమీర్ స్థాయి వారు చేస్తే బాగుంటుందని నేను భావించారు. నాకు అప్పుడు ఎవరూ చెప్పలేదు ఈ సినిమాను శంకర్ దర్శకత్వంలో తెలుగులో విడుదలవుతుందని'' అంటూ వ్యాఖ్యానించారు.

చరణ్ మాటలను చూస్తుంటే....శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'స్నేహితుడు' సినిమాలో అవకాశం దక్కించుకోక పోయానే అసంతృప్తిలో ఉన్నట్లు ఉందని, ఇంతకు ముందు హీరో మహేష్ బాబుకు శంకర్ ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మహేష్ బాబు నటించడానికి నో చెప్పారు.

రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా చేస్తున్నారు. తమన్నా నాయికగా నటిస్తోంది. మార్చికల్లా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ 'ఎవరు' అనే చిత్రం చేస్తున్నాడు. చరణ్ తొలిసారిగా ఈ చిత్రంలో ఇద్దరు భామలతో జత కడుతున్నారు. సమంతతో పాటు బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X