»   » రాజమౌళి పలకరించాడు..రామ్ చరణ్..లేదు..!?

రాజమౌళి పలకరించాడు..రామ్ చరణ్..లేదు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

78 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని రికార్డులను భూస్థాపితం చేసి నెంబర్ వన్ హిట్ చిత్రంగా ఇండస్ట్రీలో నిలిచిపోయిన 'మగధీర" చిత్రం విడుదలై జులై 31కి సంవత్సరం పూర్తికావస్తున్నా చరణ్ చిత్రం ఇప్పటికింకా విడుదల కానేలేదు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి 'మర్యాద రామన్న" చిత్రంతో పలకరించినప్పటికీ..చరణ్ మాత్రం ఇంకా ఏ చిత్రంతోనూ పలకరించలేదు.

'ఆరంజ్, మెరుపు" చిత్రాలను ఏకకాలంలో చేస్తూ బిజీగా ఉన్న చరణ్ నుంచి ఓ బంపర్ హిట్ చిత్రం వెంటనే వస్తే బావుంటుందన్నది మెగాభిమానుల ఉవాచ. వారి కోరికను తీర్చడానికి మరో రెండు మూడు నెలల్లో చరణ్ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 'ఆరంజ్" చిత్ర ఆడియోను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారమ్.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu