»   »  యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్న రామ్ చరణ్

యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగంలో అసాధార‌ణ విజ‌యాలు సాధించి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువ‌త‌రానికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ఆసియా విజన్ -2016 పేరిట యూత్ ఐక‌న్‌ పుర‌స్కారాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి క‌మిటీ టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారానికి ఎంపిక చేసుకోవ‌డం విశేషం. త‌న‌దైన ఛ‌రిష్మాతో వెండితెరపై వెలుగులు విర‌జిమ్ముతున్న స్టార్‌ హీరో చ‌ర‌ణ్‌కి కోట్లాది ప్రేక్ష‌కాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువ‌త‌రానికి స్ఫూర్తినిచ్చే అసాధార‌ణ విజ‌యాలు ఈ యువ‌హీరో సొంతం. త‌న రెండో సినిమా(మ‌గ‌ధీర‌)కే బాక్సాఫీస్ వ‌ద్ద 70 కోట్లు పైగా వ‌సూళ్లు సునాయాసంగా రాబ‌ట్టిన హీరో చ‌ర‌ణ్‌. అందుకే అత‌డి ప్ర‌తిభ‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఇటీవ‌ల‌ షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన ఆసియా విజన్ -2016 వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్న‌త యూత్ ఐక‌న్‌ పుర‌స్కారం అందించారు. దుబాయ్‌లో ప్ర‌తియేటా నిర్వ‌హించే అతి పెద్ద మ‌ల‌యాళ అవార్డుల కార్య‌క్ర‌మం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. లేటెస్టుగా చ‌ర‌ణ్ న‌టించిన ధృవ‌ అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే త‌ను నిర్మిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

English summary
Ram Charan receives youth icon award in asia vision movie awards 2016 in Dubai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu