ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ను తలపిస్తోన్న రామ్ చరణ్ ‘రచ్చ’
రామ్ చరణ్ 'మెరుపు" చిత్రం చాలాకాలం నుంచి పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే..తొలిత ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చినప్పటికి, ప్రస్తుతం చరణ్ తీరు చూస్తుంటే ధరణి ని పక్కకు నెట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి. వినాయక్ కి 'మెరుపు" ప్రాజెక్ట్ అప్పగించాలని చరణ్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ" చిత్రం చేస్తోన్న చరణ్ అనంతరం 'మెరుపు"తో మెరుస్తాడనే వార్తలు వస్తున్నాయి. రచ్చలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ..ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు బయటపడ్డాయి. ఈ చిత్రంలో చరణ్ పాత్ర 'ఆంధ్రావాలా" లోని జూ ఎన్టీఆర్ పాత్రలా ఉంటుందంట. తమన్నా డబ్బున్న అమ్మాయిగా నటిస్తోందని సమచారం. చరణ్ పేదవాళ్లని ఆదరించే పాత్ర చేస్తున్నాడని సమాచారం. మొత్తం మాస్ మాస్ గా ఉంటుందని వినికిడి. చరణ్ పాత్రతో పాటు ఈచిత్రంలో మరో ప్రధాన పాత్ర ఉందని దాని 'ప్రస్థానం" హీరో శర్వానంద్ ఎంపికయ్యడాని తెలిసింది...


Click it and Unblock the Notifications











