‘ఎవడు’ రిలీజ్ ఖరారు చేస్తూ దిల్ రాజు ప్రకటన
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కించిన చిత్రం 'ఎవడు'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
గత సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడం, అగ్రహీరోలకి 7వ చిత్రం బ్లాక్ బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్టుబస్టర్‌లో నెం.1 ఆడియోగా ఉండటం విశేషం.
ఇదిలా ఉండగా విడుదల సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని సంబంధించిన స్పెషల్ టీజర్ ని జనవరి 3న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...'ఎవడు' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది' అన్నారు.

అల్లు అర్జున్ పది నిమాషాలు కనిపించినా ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. సినిమా అవుట్‌పుట్ చూసుకుని మా యూనిట్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమా ఇది. అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం.
రామ్ చరణ్ కెరీర్లో ఇది ఓ మైల్ స్టోన్ అవుతుంది. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్లందరికీ ఇది బెస్ట్ ఫిల్మ్ గా ఉంటుంది. మెగా అభిమానులందరి అంచనాలుచేరుకునేలా మా 'ఎవడు' ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అన్నారు.
సహ నిర్మాతలు శిరీష్-లక్ష్మణ్ మాట్లాడుతూ...'ఎవడు చిత్రం అందరం చూసాం. చాలా సంతోషంగా ఉన్నాం. దేవి అందించిన ఆడియో సూపర్ గా ఉంటుంది. రామ్ చరణ్ నటన, బన్ని సర్ ప్రైజింగ్ ఎప్పియరెన్స్ అదిరిపోతాయ్, కాజల్ చేసింది చిన్న పాత్రే
అయినా గుర్తిండిపోతుంది. హీరోయిన్స్‌గా శృతి హాసన్, అమీ జాక్సన్ ఆకట్టుకుంటారు. రామ్ చరణ్ డాన్సులు అదరిపోయాయి. స్పెషల్ టీజర్ విడుదల చేసి సంక్రాంతికి సందర్భంగా జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నాం' అన్నారు.
ఈ చిత్రంలో జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయికుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ : వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు : అబ్బూరి రివి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్ : ఆనంద్ సాయి. సహ నిర్మాతలు: శిరీష్ లక్ష్మణ్, నిర్మాత: రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











