‘శుభలేఖ రాసుకోనున్న’ రామ్ చరణ్, కాజల్ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తండ్రి నటించిన సినిమాల్లోని పాటలు రీమిక్స్ చేసే సెంటిమెంటు బాగా కలిసొస్తోంది. మగధీర చిత్రంలో మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ చేయడంత ఆచిత్రం పెద్ద హిట్టయింది. రచ్చ చిత్రంలో చేసిన 'వాన వాన వెల్లువాయే' పాట రీమిక్స్ కూడా దుమ్ము రేపింది.
తాజాగా రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో తన తండ్రి నటించిన కొండవీటి దొంగ చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా' అనే సాంగుకు స్టెప్పులు వేయన్నారు. అప్పట్లో ఈ పాటలో చిరంజీవి, రాధా అద్భుతంగా స్టెప్పులేశారు. ఆ పాటపై ఉన్న క్రేజ్‌ను తాజాగా క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు చెర్రీ.
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఈచిత్రంలో చెర్రీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. మెగా హీరోలకు బాగా కలిసొచ్చిన కోల్‌కతాలో జులై 20 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











