»   » రంగస్థలం సెట్స్ పై రామ్ చరణ్ కి గాయాలు: అయినా సరే షూటింగ్ ఆపలేదు

రంగస్థలం సెట్స్ పై రామ్ చరణ్ కి గాయాలు: అయినా సరే షూటింగ్ ఆపలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రాజమండ్రి సమీపంలోని గోదావరి తీరంలో కొన్ని రోజులుగా'రంగస్థలం 1985' కోసం రామ్‌చ‌ర‌ణ్‌ పై చిత్రీకరణ జరుపుతున్నారు. ప్ర‌స్తుతం వాన‌లు జోరుగా కురుస్తుండ‌డంతో వాటిని కూడా ఉప‌యోగించుకుంటున్నాడ‌ట డైరెక్ట‌ర్ సుకుమార్.

Charan shoots amid tough conditions for 'Rangasthalam

ఈ సినిమాలో వాన‌లు అవ‌స‌ర‌మ‌ట‌. దీంతో వాన‌లో కూడా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. లుంగీ క‌ట్టుకొని న్యూలుక్‌లో చెర్రీని చూసి అక్క‌డి అభిమానులు మురిసిపోతున్నార‌ట‌. స‌మంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు. సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రామ్‌చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయట. వాటిని లెక్క చేయకుండా చెర్రీ షూటింగ్‌లో పాల్గొంటున్నారని చిత్ర బృందం చెబుతోంది.ఈ రొమాంటిక్-డ్రామా కోసం ఈ యంగ్‌ హీరో చాలా కష్టపడుతున్నాడట. ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాడని చిత్ర యూనిట్‌ వర్గాల కథనం.


Charan shoots amid tough conditions for 'Rangasthalam

చాలా కష్టతరమైన షెడ్యూల్ కోసం రోజంతా పనిచేస్తున్నాడని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు షూటింగ్‌ కార్యక్రమాలను మొదలుపెడితే సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఇవి ముగిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ కారణంగా చరణ్ గాయపడుతున్నప్పటికీ, అలాంటివేమీ లెక్కచేయకుండా రామ్‌ చరణ షూటింగ్‌ కార్య క్రమాలను కొనసాగిస్తున్నారంటూ చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ నెలాఖరు తర్వాత హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.


English summary
Actor Ram Charan is braving tough conditions and shooting longer hours for upcoming Telugu rural-based romantic-drama "Rangasthalam"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu