బోరు కొట్టించేస్తున్న రామ్ చరణ్..!
ఇంతకాలం తన ప్రేమ సంగతి పబ్లిక్ కాకూడదని తనలోనే దాచి పెట్టుకుని తిరిగిన చరణ్ ఇప్పుడు పెద్దల సమ్మతం లభించి, త్వరలోనే పెళ్లికి ముహూర్తం కూడా పెడుతుండేసరికి తన ఎక్సయిట్ మెంట్ దాచుకోలేకపోతున్నాడు. ఇప్పుడు తనకి ఎవరు తారసపడినా కానీ తన పెళ్లి సంగతులు, ప్రేమ జ్ఞాపకాలు చెప్పి చెప్పి బోరు కొట్టిస్తున్నాడట. ముఖ్యంగా ఉపాసన గురించిన ఉపోద్ఘాతమైతే తట్టుకోవడం ఎవరు తరం కావడం లేదట.
ఉపాసన అంత మంచి అమ్మాయి, ఇలాంటమ్మాయి అంటూ ఊదరగొడుతూ ఉంటే టాపిక్ కట్ చేసి అతడి దగ్గర్నుంచి వెళ్లలేక, అక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నారట. ఉపాసనని ఆరేళ్లుగా ప్రేమిస్తున్న చరణ్ ఇంతకాలం మీడియా ముందు తన పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన ఫేవరెట్ రిపోర్టర్స్ ని పిలిచి మరీ ఆర్టికల్స్ రాయించుకుంటున్నాడని సమాచారం..


Click it and Unblock the Notifications











