రజనీ అల్లుడి సినిమా రీమేక్ లో చిరు కొడుకు!
ఆ మధ్య చిరంజీవి చెన్నయ్ లో ఉన్నప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన పొల్లదవన్ సినిమాను వీక్షించాడు. ఆ సినిమా చిరంజీవికు బాగా నచ్చింది. ఆ సినిమాను తెలుగులో తన కొడుకు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని కూడా చిరంజీవి అనుకున్నాడు. త్వరలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ప్రారంభం కానున్నందున తమిళ సినిమా రీమేక్ సాధ్యం కాదు కాబట్టి ఆ సినిమా హక్కులు కొనిపెట్టుకుని ఉంటే బాగుంటుందని భావించిన చిరంజీవి ఆపనిని తన బావమరిది అల్లు అరవింద్ కు అప్పగించినట్టు సమాచారం. రాజమౌళి సినిమా తరువాత ఈ సినిమాను అంటే రామ్ చరణ్ కెరీర్ మూడో సినిమాగా రూపొందే అవకాశాలు ఉన్నట్టు సమాచారం


Click it and Unblock the Notifications











