రామ్ చరణ్-రాజస్థాన్

By Staff

తండ్రి చిరంజీవి రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతుంటే తనయుడు రామ్ చరణ్ రాజమౌళితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కథను చిరంజీవికి వినిపించడం, కథ బాగుందని రాజమౌళిని మెచ్చుకోవడం జరిగిపోయాయి. ఈ కథ ఎడారి రాష్ట్రం రాజస్థాన్ కి సంబంధించినదిగా ఫిల్మ్ నగర్ సమాచారం. మొత్తానికి ఈ కథ రాజమౌళి మార్కుతో ఇతర రాష్ట్రం నుంచో, ఇతర ప్రాంతం నుంచో హీరో కథ మొదలవుతుంది. ఆ మాదిరే ఈ సినిమాలో రాజస్థాన్ నుంచి రామ్ చరణ్ ప్రస్థానం ఉంటుందన్నమాట. చిరుత సినిమా ప్రివ్యూ చూసిన వెంటనే రామ్ చరణ్తో తన సినిమా కూడా మాస్ సినిమానే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి కీరవాణి అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X