చరణ్ రింగ్ తొడిగే సుభ గడియలు- 1న 11.55 కి..!
రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని విశ్వసనీయ సమాచారం.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం వీళ్ల పెళ్లి దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్నట్లు తెలుస్తూంది. చరణ్ పెళ్లిని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడంలో భాగంగానే చిరంజీవి ఈ ప్లాన్ వేసినట్లు చర్చించుకుంటున్నారు. చెర్రీ, ఉపాసనల నిశ్చితార్థానికి గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ హంగు ఆర్భాటాలతో తయారవుతోందని సమాచారం. నిశ్చితార్థం, పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఇరు కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











