కోటలో మెగా సందడి...డ్రైవర్ అవతారమెత్తిన చిరు!
రామ్ చరణ్-ఉపాసన వివాహం ఈ నెల 14న జరుగనున్న నేపథ్యంలో మెగా, కామినేని కుటుంబ సభ్యులు మంగళవారం ఉపాసన పూర్వీకులకు సంబంధించిన దోమకొండ కోటలో సందడి చేశారు. కోటలో కొలువైన మైసమ్మ తల్లికి రామ్ చరణ్-ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన చేతుల మీదుగా వెయ్యిమంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వాహనం డ్రైవ్ చేస్తూ చరణ్-ఉపాసనలను ఎక్కించుకుని కోట ప్రాంగణంలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో దోమకొండ ప్రాంతంలో భారీ భ్రదత ఏర్పాట్లు చేశారు. చరణ్-ఉపాసనలను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక మీడియా హడావుడి సరేసరి.
దోమకొండలో పూజలు నిర్వహించిన అనంతరం అందరూ నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ శివారు గండిపేటలోని ఉపాసన కుటుంబీకులకు సంబంధించిన ఫాం హౌస్‌లో పెళ్లి వేడుక జరుగనుంది. ఈ వేడుకకు రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ వేడకకు ఎవరూ పడితే వారు హాజరుకావడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం సన్నిహితులు, చిరు ఆహ్వానం అందుకున్న వీవీఐపీలకు మాత్రమే ఇందులో ఎంట్రీ ఉంది. మామూలు పాసులు అయితే వెరైటీ ఏముంది? అనుకున్నారో ఏమో....తమ రేంజ్ కి తగిన విధంగా ఎలక్ట్రానిక్ ఎంట్రీ పాసులను తయారు చేయించారు మెగా-కామినేని కుటుంబ సభ్యులు. అభిమాను కోసం జూన్ 15న టెంపుల్ ట్రీస్‌లో ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











