గ్రీస్, ఐస్‌లాండ్‌కు రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో గ్రీస్, ఐస్ లాండ్‌కు వెళ్ల బోతున్నాడు. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న షూటింగ్‌లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి చెర్రీ అక్కడికి వెలుతున్నాడు. ఆగస్టులో అక్కడ షూటింగ్ ప్రారంభం కానుంది...ప్రొడక్షన్ వర్గాల నుంచి అందిన సమాచారం.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట.
ఈచిత్రంలో తన తండ్రి నటించిన కొండవీటి దొంగ చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా' అనే సాంగుకు స్టెప్పులు వేయన్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు కోల్ కతాలో జరుగుతోంది. అక్కడ చరణ్ పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్'తో పాటు...వంశీ పైడి పల్లి దర్శకత్వంలో 'ఎవడు'చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











