అట్టుడుకుతున్న ఇండస్ట్రీ: నటిపై‌రేప్ కేసులో హీరో‌పై చార్జ్‌షీట్ దాఖలు

Recommended Video

నటి పై‌ రేప్ కేసులో హీరో‌పై చార్జ్‌షీట్

గత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని, స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సినీ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో సిట్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒక రకంగా ఈ కేసు మాలీవుడ్‌లోనే కాదు, తమిళ ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌కి కూడా ప్రత్యేకమైనదే.

 మొదటి భార్య మంజు వారియర్‌

మొదటి భార్య మంజు వారియర్‌

కావ్యమాధవన్‌తో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆధారాలతో తన మొదటి భార్య మంజు వారియర్‌ వద్ద బయటపెట్టిందని బాధిత నటిపై దిలీప్‌ కక్ష పెంచుకొని పల్సర్‌ సునీతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది. కావ్యా మాధవన్ తో ప్రేమాయణం లీకైన తర్వాత దిలీప్ మంజు వారియర్ కు విడాకులు ఇచ్చేశారు.

అత్యాచారం చేయించడానికి స్కెచ్

అత్యాచారం చేయించడానికి స్కెచ్

అప్పటినుంచి నటిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. 2013లోనే ఆమెపై అత్యాచారం చేయించడానికి స్కెచ్ వేశాడు. ఇందుకోసం పల్సర్ సునీతో చర్చలు జరిపిన దిలీప్.. రూ.1.5కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. రేప్ సమయంలో నటి అత్యాచార వీడియోలు, ఫోటోలు అత్యంత క్లారిటీతో చిత్రీకరించాలని చెప్పాడు. అన్నది ఇప్పుడు దిలీప్ పై ఉన్న బలమైన ఆరోపణ.

 దిలీప్‌‌ను 8వ ముద్దాయిగా

దిలీప్‌‌ను 8వ ముద్దాయిగా

ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలతో నటుడు దిలీప్‌పై సిట్‌ బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. దిలీప్‌‌ను 8వ ముద్దాయిగా, పల్సర్‌ సునీని మొదటి ముద్దాయిగా చేర్చింది. బాధిత నటిని మొదటి సాక్షిగా పేర్కొంది. ఆ తర్వాత సాక్షులుగా పేర్కొన్న వాళ్లలో దిలీప్ ఇద్దరు భార్యలు కూడా ఉండటం గమణార్హం

 దాంపత్యంలో విభేదాలు

దాంపత్యంలో విభేదాలు

అందులో దిలీప్ భార్య మంజు వారియర్ తో బాధితురాలికి మంచి స్నేహం ఉందని పోలీసులు తెలిపారు. దిలీప్ వ్యవహార శైలితో వారి దాంపత్యంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలో కావ్యమాధవన్‌ తో దిలీప్ కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బాధితురాలు పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది.

 50 మందిని సాక్షులుగా

50 మందిని సాక్షులుగా

దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న దిలీప్... పల్సర్ సునీ సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చార్జిషీట్ లో సిట్ పేర్కొంది. ఈ కేసులో పల్సర్ సునీని మొదటి ముద్దాయిగా పేర్కొన్న సిట్ అధికారులు, దిలీప్ ను 8వ ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ కేసులో మొదటి సాక్షిగా బాధితురాలి పేరును సిట్ పేర్కొంది. మంజు వారియర్, కావ్యమాధవన్ తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని సాక్షులుగా ఛార్జిషీట్ లో సిట్ పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X