వ్యాపారి కుటుంబంపై హీరో దాడి నిజమే!..కేసు కోర్టుకి
సైఫ్, అతని స్నేహితులు దక్షిణాఫ్రికా వ్యాపారి ఇక్బాల్ మబీర్ శర్మ, అతని మామ రమన్ పటేల్‌పై పిడిగుద్దులు కొట్టారని దీంతో ఇక్బాల్ ముక్కుకు గాయమైందని ఛార్జిషీటులో ఆరోపించారు. ఈ వివాదానికి సంబంధించి మీడియా కథనాలు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సమర్పించారు. దౌర్జన్యం నిజమేనని సుమారు 29 మంది సాక్షులు వెల్లడించినట్లు సమాచారం. ఎవరిది తప్పయినప్పటికీ తాము కేసును పకడ్బందీగా పెట్టామని, సరైన ముగింపు లభిస్తుందని ఏసీపీ శివాజీ కొలేకర్ తెలిపారు.
సైఫ్, కరీనా, కరిష్మా, మలైకా అరోరా ఖాన్, అమృత అరోరా మరికొందరు స్నేహితులు తాజ్ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ గొడవ జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులతో ఉన్న ఇక్బాల్‌శర్మ కాస్త నిశ్శబ్దంగా ఉండాలని సైఫ్‌ను కోరినప్పుడు సైఫ్ గొడవకు దిగినట్లు వెల్లడించారు. అయితే ఈ కేసు విషయమై సైఫ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడటానికి ఇష్టం చూపించలేదు.


Click it and Unblock the Notifications












