twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యాపారి కుటుంబంపై హీరో దాడి నిజమే!..కేసు కోర్టుకి

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, అతని అనుయాయులు ఇద్దరిపై కొలాబా పోలీసులు నేరారోపణ పత్రం దాఖలు చేశారు. గత ఫ్రిబవరి 22న దక్షిణ ముంబయిలోని స్టార్ హోటల్ తాజ్‌ హోటల్‌లో దక్షిణాఫ్రికా వ్యాపారి, అతని మామపై దౌర్జన్యానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఎనిమిదో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో 120 పేజీల నేరారోపణ పత్రం దాఖలు చేసినప్పుడు సైఫ్‌ ఆలీఖాన్‌, అతని అనుయాయులైన వ్యాపారి షకీల్‌ లడక్‌, నిర్మాత బిలాల్‌ అమ్రోహి హాజరయ్యారు. ఐపీసీ సెక్షన్లు 325 (దౌర్జన్యం)తోసహా 34 (నేరపూరిత కుట్ర) కింద నేరం మోపారు.

    సైఫ్‌, అతని స్నేహితులు దక్షిణాఫ్రికా వ్యాపారి ఇక్బాల్‌ మబీర్‌ శర్మ, అతని మామ రమన్‌ పటేల్‌పై పిడిగుద్దులు కొట్టారని దీంతో ఇక్బాల్‌ ముక్కుకు గాయమైందని ఛార్జిషీటులో ఆరోపించారు. ఈ వివాదానికి సంబంధించి మీడియా కథనాలు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సమర్పించారు. దౌర్జన్యం నిజమేనని సుమారు 29 మంది సాక్షులు వెల్లడించినట్లు సమాచారం. ఎవరిది తప్పయినప్పటికీ తాము కేసును పకడ్బందీగా పెట్టామని, సరైన ముగింపు లభిస్తుందని ఏసీపీ శివాజీ కొలేకర్‌ తెలిపారు.

    సైఫ్‌, కరీనా, కరిష్మా, మలైకా అరోరా ఖాన్‌, అమృత అరోరా మరికొందరు స్నేహితులు తాజ్‌ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ గొడవ జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులతో ఉన్న ఇక్బాల్‌శర్మ కాస్త నిశ్శబ్దంగా ఉండాలని సైఫ్‌ను కోరినప్పుడు సైఫ్‌ గొడవకు దిగినట్లు వెల్లడించారు. అయితే ఈ కేసు విషయమై సైఫ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడటానికి ఇష్టం చూపించలేదు.

    English summary
    
 Ten months after Saif Ali Khan allegedly assaulted a South-Africa based businessman Iqbal Mir Sharma and his father-in-law at a luxury hotel in Colaba, the Mumbai Police has filed a charge sheet against the Bollywood actor and his two associates in the case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X