ముప్పుతిప్పలు పెట్టిన చార్మీ

యువ నిర్మాతలు రవి ప్రకాష్, కళ్యాణ్ రామ్ లు మంత్ర సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. చార్మీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సినిమా నిర్మాణం సగం పూర్తి కాగానే వారు ఆర్థిక ఇబ్బందులలో పడ్డారు. ఎట్టకేలకు సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. ఇక్కడే చార్మీ ట్విస్ట్ ఇచ్చింది. సినిమా విడుదలకు ముందే తనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రూ.5 లక్షల బాకీని చెల్లించాల్సిందేనని పట్టుపట్టింది. దీనికి బెదిరిన నిర్మాతలు చార్మీ మేనేజర్ శ్రీనివాస్ ను కలుసుకున్నారు. సినిమా విడుదల అయిన తరువాత వచ్చిన డబ్బుతో మిగతా బాకీ తీరుస్తామన్నారు. దీనికి అంగీకరించకుండా మంత్ర సినిమా మలయాళ హక్కులు ఇస్తే ఒప్పుకుంటామని శ్రీనివాస్ బదులిచ్చారు. ఎట్టకేలకు సినిమా విడుదల అయింది. సినిమా ఘనవిజయం సాధించడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా ప్రమోషన్ టూర్, సక్సెస్ మీట్ కోసం నిర్మాతలు మరోమారు చార్మీ వద్దకు వెళ్లారు. మరోమారు మరో షరతు విధించింది. అదేమంటే తాను పాల్గొనే ప్రెస్ మీట్ కు హీరో శివాజీని కానీ మరొకరిని కానీ పిలవవద్దని కరాఖండిగా చెప్పింది. అంతేనా మంత్ర సినిమా తమిళ హక్కులను అమ్మారని తెలిసి ఆగ్రహం చెందింది. తాను తీసుకునేదాన్ని కదా అని క్లాస్ పీకింది.


Click it and Unblock the Notifications











