లావు తగ్గిన చార్మీ

మంత్ర సినిమాలో అందాలను ఆరబోసిన చార్మి ఇప్పుడు లావు తగ్గించుకునే పనిలో పడిందట. తన ఒంపుసొంపులతో ప్రేక్షకుల మదిలో సెక్సీ తారగా ముద్ర వేసుకున్న ఆమె బరువు పెరిగితే కష్టాలు తప్పవని భావిస్తోందట. కాస్తా బరువు పెరిగినట్లు అనిపించే సరికి ఆమె అందుకు విరుగుడు తప్పదని భావించినట్లు చెబుతున్నారు. బరువును తగ్గించుకుని స్లిమ్ గా కనిపించడానికి ఆమె జిమ్ కు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కష్టం ఫలించి ఆమె బరువు తగ్గిందట. ఏమైనా అందమే ఏ హీరోయిన్ నైనా నాలుగు కాలాల పాటు సినిమా రంగంలో నిలబెడుతుంది కదా.


Click it and Unblock the Notifications











