ఆయన మాట మీద నిలబడ్డ దర్శకుడు : ఛార్మి

By Srikanya

హైదరాబాద్ : నా పాత్రను తెరపై చందు ఎలా చూపిస్తారోనని భయపడ్డా. అయితే మాట మీద నిలబడ్డ అతి కొద్దిమంది దర్శకుల్లో చందు ఒకరు అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి. అలాగే వేశ్య పాత్రను చేయమని గతంలో కొంతమంది దర్శకులు అడిగితే చేయనన్నాను. చందుకు కూడా మొదట అలాగే చెప్పాను. కానీ ఆయన సినిమాలు 'టెన్త్ క్లాస్', 'నోట్‌బుక్' చూశాక మనసు మార్చుకుని, కథ విన్నాను అని అంది.

'ప్రేమ ఒక మైకం' ఫెంటాస్టిక్ స్క్రిప్టు అనీ, చెయ్యమనీ నా స్నేహితురాలు ఫరీబా చెప్పింది. అందుకే ఈ సినిమాని ఆమెకి అంకితం చేస్తున్నా. ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ. ఇందులోని డైలాగ్స్ చెప్పాక రచయితగా పరిచయమవుతున్న పులగం చిన్నారాయణకు అభిమానినైపోయా అని చెప్పారు.

చందు దర్శకత్వంలో 'ప్రేమ ఒక మైకం' వంటి సినిమా చేసినందుకు నటిగా గర్వపడుతున్నానని ఆ చిత్ర కథానాయకి ఛార్మి చెప్పారు. అందులో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. టూరింగ్ టాకీస్ పతాకంపై దుడ్డు వెంకట సురేశ్, కె. సూర్యశ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన 'ప్రేమ ఒక మైకం' సినిమా ఆడియో సీడీలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి.

తన మొదటి సినిమా 'టెన్త్ క్లాస్' కంటే ముందే ఈ స్క్రిప్టు రాసుకున్నాననీ, ఇందులోని వేశ్య పాత్రను పవిత్రంగా తీర్చిదిద్దాననీ చందు చెప్పారు. ఒక వేశ్య, ఒక రచయిత, ఒక గాయని మధ్య నడిచే ప్రేమకథ ఈ చిత్రమనీ తెలిపారు. ఈ చిత్రంలో ఛార్మి, రాహుల్, శరణ్య ప్రధాన పాత్రధారులు. ఎస్.ఆర్. పాశో, ఎం.జి.కె. ప్రవీణ్ సంయుక్తంగా సంగీతం సమకూర్చగా, కులశేఖర్, శశి పాటలు రాశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X