జ్యోతిలక్ష్మి...రూమర్‌పై స్పందించిన చార్మి

By Bojja Kumar

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయాలన్న చార్మి కల త్వరలో నెరవేరనున్న సంగతి తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మి' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం అప్పట్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉర్రూతలూగించిన నటి జ్యోతిలక్ష్మి జీవిత కథతో రూపొందనుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్నిచార్మి ఖండించారు.

దీనిపై చార్మి మాట్లాడుతూ... -‘పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న మాట నిజమే. అయితే అందులో నేను పోషిస్తున్న పాత్ర ఎవరిని ఉద్దేశించి కాదు. బ్రతికున్న, చనిపోయిన మరెవరి జీవితంపైనా కాదు. మీడియాలో జరుగుతున్నట్లు జ్యోతిలక్ష్మి జీవితానికి ఈ సినిమాకు అసలు సంబంధమే ఉండదు' అని తెలిపారు.

Charmi about Jyothi Lakshmi film

ఈ చిత్రంలో చార్మి రెండు డిఫరెంటు లుక్స్ లో కనిపించబోతోంది. సినిమాకు ఆమె లుక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. సినిమాలోని క్యారెక్టరుకు తగిన విధంగా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉందట చార్మి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ప్రస్తుతం చార్మి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘మంత్ర-2' కాగా, మరొకటి 10 ఎంరదుకుల్లా అనే తమిళ చిత్రం. ‘మంత్ర-2' చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.రవికుమార్‌రెడ్డి సమర్పణలో పి.శౌరీరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X