twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్ ప్రపోజల్స్,పెళ్లి గురించి చార్మి

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఐ లవ్యూ' అని చాలామంది చెప్పారు. అలా చెప్పిన ప్రతి ఒక్కరితోనూ 'అయితే నేనేం చేయాలి' అని అడిగేదాన్ని. అందరికీ నేను ఐ లవ్యూ చెప్పలేను కదా అంటూ తన లవ్ ప్రపోజల్స్ గురించి ఛార్మి చెప్పుకొచ్చింది. అలాగే...నా డ్రీమ్‌బోయ్ ఇలా ఉండాలనే ఊహలేమీ లేవు. అయినా నేను అంత ఎక్కువ ఊహించను కూడా. ఏదైనా జరగాల్సింది జరుగుతుంది. ఆ మూమెంట్‌లో నేను ఫీల్ అయితే ఐ లవ్యూ చెబుతాను. ఏదైనా ఆ టైమ్‌ని బట్టి ఉంటుంది అంది.

    తనకి లవ్ మ్యారేజే అవకాసం ఉందని చెప్తూ... నా తత్వానికి అరేంజ్డ్ మ్యారేజ్ కష్టం. నాకు ఆ వ్యక్తి గురించి బాగా తెలియాలి. ముఖ్యంగా అతనికి నా ప్రొఫెషన్ గురించి తెలియాలి. ఎందుకంటే నా ప్రొఫెషన్‌లో టైమింగ్స్ ఉండవు. అవుడ్డోర్‌లు వెళ్తుండాలి. అలాగే చిన్న చిన్న డ్రెస్‌లు వేసుకోవాల్సి వస్తుంది. అందుకే నా లైఫ్ స్టయిల్‌ని అండర్‌స్టాండ్ చేసుకున్నవాళ్లతోనే నేను ఉండగలను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు భయం కూడా. సడన్‌గా కొత్త వ్యక్తితో జీవితం ఎలా? నా గురించి బాగా తెలిసినవాళ్లయితేనే బావుంటుంది అంది.

    అలాగే నేను మనిషినే కదా! నాకూ ఓ మనసుంటుంది. దానికీ స్పందన ఉంటుంది. అలాగని అందర్నీ ప్రేమించేయలేం. అయినా ఇప్పుడు నా వయసు 24ఏళ్లు. పెళ్లి కబుర్లకు ఇంకా చాలా టైముంది అంది. ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనే విషయం గురించి చెప్తూ... చూస్తున్నారు కాదు, వస్తున్నాయి. బోలెడుమంది తెలుగువాళ్లు, పంజాబీలు, ఇద్దరు ముగ్గురైతే నాకు బాగా తెలిసినవాళ్లు మా ఇంటికొచ్చి మరీ అమ్మా నాన్నతో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట్లాడారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ, ఈ ఏడాది అయితే మాత్రం ఉండదు అని తేల్చి చెప్పింది.

    English summary
    Charmy clarify that she perfers love marriage only. And also say her marriage will be next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X